: కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తా: కొండా సురేఖ
వరంగల్ జిల్లా పరకాల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ చెప్పారు. పలు పార్టీల నుంచి తనకు, తన భర్త కొండా మురళికి ఆహ్వానముందని తెలిపారు. అయితే, టీడీపీలో చేరుతున్నామన్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు.