: తనకు పీసీసీ అధ్యక్ష పదవి రాకుండా దొరలు అడ్డుకున్నారు: దానం
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ దొరల పాలన రాకుండా అడ్డుకుంటానని మాజీ మంత్రి దానం నాగేందర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు దొరలు ఉన్నారని... పీసీసీ రేసులో ఉన్న తనకు పదవి రాకుండా ఆ దొరలే చక్రం తిప్పి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. బీసీ, ఎస్సీలకు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.