: ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించగలరా?: టీఆర్ఎస్ పై పొన్నాల ధ్వజం


టీఆర్ఎస్ పార్టీ వ్యవహారశైలిపై తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడు పొన్నాల ధ్వజమెత్తారు. తెలంగాణను తామే సాధించామని టీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. కేవలం ఇద్దరు ఎంపీలతో రాష్ట్ర సాధన సాధ్యమేనా? అని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని చెప్పారు. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ప్రస్తుతం పొత్తుల చర్చలు కొనసాగుతున్నాయని... తమకు కూడా అనుకూలమైతే ముందుకు వెళతామని చెప్పారు.

  • Loading...

More Telugu News