: ఢిల్లీలో చక్రం తిప్పేది టీడీపీనే: చంద్రబాబు


పార్లమెంటులో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ హయాంలో టీడీపీ సహకారంతో వాజ్ పేయి ప్రధాని కాగలిగారని... మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పేది టీడీపీనే అని చెప్పారు. కాంగ్రెస్ కు జగన్ దత్తపుత్రుడని, కేసీఆర్ అద్దె పుత్రుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. పేదవారికి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనే అని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ కు ఎవరు చెప్పారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగైందని... తెలంగాణలో బలపడలేదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో సీమాంధ్రను, తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేది టీడీపీనే అని చెప్పారు.

  • Loading...

More Telugu News