: గాంధీ భవన్ లో యుద్ధ వాతావరణం
హైదరాబాదులోని గాంధీ భవన్ యుద్ధ భూమిని తలపిస్తోంది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. పల్లె లక్ష్మణ్ గౌడ్, దానం వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. మీడియా రూమ్ లో ఈ ఘర్షణ చెలరేగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ విషయంలో వీరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఘర్షణలో మీడియా రూమ్ లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణ సమయంలో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా కూడా అక్కడే ఉన్నారు.