: విశాఖ ప్రజాగర్జనలో అయ్యన్న పాత్రుడి సెటైర్లు


టీడీపీ అసంతృప్త నేత అయ్యన్నపాత్రుడు విశాఖ ప్రజాగర్జన సభలో సెటైర్లు వేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చినవాళ్ళు ఎంతకాలం ఉంటారోగానీ, తాము మాత్రం చచ్చేదాకా పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సభలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం తెలిసిందే. టీడీపీలో నాయకులు పోయినా కార్యకర్తలు మిగిలే ఉన్నారని అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. అవినీతికి వ్యతిరేకంగా, పేదలు మహిళల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News