: ఓట్లు, సీట్ల కోసం నిర్ణయం తీసుకున్నారు: గంటా
టీడీపీలో చేరిన గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దారుణంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి బాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు అవసరమని పేర్కొన్నారు.