: సూర్యోదయం ఎంత వాస్తవమో, బాబు సీఎం కావడం కూడా అంతే వాస్తవం: గంటా
ప్రతి రోజూ సూర్యుడు ఉదయించడం ఎంత కామనో, చంద్రబాబు నాయుడు సీఎం కావడం కూడా అంతే వాస్తవం అని గంటా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఈసారి కార్యకర్తల్లో కసి కనిపిస్తోందని, ఇది చారిత్రక సమయమని అభిప్రాయపడ్డారు. బాబు కలలు కన్న స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కావాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యమని గంటా అభిప్రాయపడ్డారు.