: తెలుగువాళ్ళకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే, బాబు అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్ళారు: గంటా


రాష్ట్రం సుభిక్షంగా పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ జెండాను పసుపుపచ్చ రంగులో రూపొందించారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. విశాఖ ప్రజాగర్జన సభలో టీడీపీలో చేరిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ కూకటి వేళ్ళతో కుప్పకూలిందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తెలుగువాళ్ళకు గుర్తింపు తెస్తే, ఆ గుర్తింపును చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారని గంటా కొనియాడారు.

  • Loading...

More Telugu News