: భారత మొబైల్ వినియోగదారులకు 'మెకాఫీ' ఉచిత ఆఫర్
యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీదారు మెకాఫీ భారత్ లోని మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఉచిత ఆఫర్ ప్రకటించింది. తమ నూతన సాఫ్ట్ వేర్ ను భారత్ లోని మొబైల్ వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేకుండానే డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సాఫ్ట్ వేర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైళ్ళకు మాత్రమే ఉపయుక్తమని, దీనిద్వారా యాంటీ వైరస్, యాంటీ థెఫ్ట్, ప్రైవసీ ఫీచర్లతో వెబ్ ప్రొటెక్షన్ కూడా పొందవచ్చని మెకాఫీ వర్గాలు తెలిపాయి.