: రాజకీయ పార్టీలతో రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం
రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ... రేపటి సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వాయిదాపై అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి సుప్రీంకోర్టుకు తెలియజేస్తామని అన్నారు.
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో మంగళవారం నాటికి 731 నామినేషన్లు దాఖలైనట్లు నవీన్ మిట్టల్ చెప్పారు. ఇందులో వివిధ పార్టీల నుంచి 530 నామినేషన్లు, ఇండిపెండెంట్లు 201 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లాలో అధికంగా 135 నామినేషన్లు, ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా 9 నామినేషన్లు దాఖలైనట్లు మిట్టల్ వెల్లడించారు.