: చర్చలకు మొండికేస్తున్న రష్యా
క్రిమియా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఓవైపు అంతర్జాతీయ సమాజం ఘోషిస్తుండగా, రష్యా ససేమిరా అంటోంది. తాము చర్చలకు ముందుకొచ్చినా, రష్యా నాయకత్వం సానుకూలంగా స్పందించడంలేదని ఉక్రెయిన్ తాత్కాలిక అధ్యక్షుడు అలెగ్జాండర్ తుర్చినోవ్ ఆరోపించారు. రిఫరెండం నేపథ్యంలో క్రిమియాలో సైన్యాన్ని మోహరించబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఉక్రెయిన్ మధ్యంతర ప్రధాని ఆర్సెనీ యత్సెన్యుక్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అవనున్నారు. ఈ మేరకు అమెరికా పయనమయ్యారు. గురువారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో యత్సెన్యుక్ ప్రసంగిస్తారు.