: రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదు వేలకు పైగా ఎన్నికల కేసులు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5,419 ఎన్నికల కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ కేసులకు సంబంధించి 2,192 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. 59,205 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. అక్రమ మద్యం నిల్వ వ్యవహారంలో 3,751 కేసులు నమోదు చేశామని, 1,284 మందిని అరెస్ట్ చేశామని నవీన్ మిట్టల్ చెప్పారు.