: ఆ అందాల రాణి ‘ఆమ్ ఆద్మీ పార్టీ’లో చేరింది


బాలీవుడ్ నటి, మోడల్, మాజీ అందాల రాణి గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె చండీగఢ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. చండీగఢ్ సీటు తొలుత దివంగత నటుడు జస్పాల్ భట్టి భార్య సవిత భట్టి(53)కి కేటాయించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వారం రోజుల తర్వాత ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. స్థానిక ఏఏపీ నేతలు సహకరించడం లేదంటూ పోటీలో నిలిచేందుకు ఆమె విముఖత చూపారు. దీంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు గుల్ పనాగ్ కు గ్రీన్ సిగ్నల్ పడింది. గుల్ పనాగ్ తండ్రి మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఇప్పటికే ఏఏపీలో ఉన్నారు. చండీగఢ్ లో పుట్టిన గుల్ పనాగ్ 1999లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. మూడు సంవత్సరాల క్రితం చండీగఢ్ గురుద్వారాలో ఆమె వివాహం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News