: 'ఈ అభ్యర్థి మీకు ఇష్టమేనా?'... టీడీపీ అభిప్రాయ సేకరణ!
భారతదేశంలోనే తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ ఓటర్ల నుంచి ఐవీఆర్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ (ఐవీఆర్) పద్ధతి ద్వారా కోట్లాది మంది ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు సోషల్ మీడియా వెబ్ సైట్ ‘ఫేస్ బుక్’లో తెలుగుదేశం పార్టీ తెలిపింది. ‘‘ఈ అభ్యర్థి మీకు ఇష్టమేనా?’’ అంటూ ప్రజలను ఫోన్ ద్వారా అడిగి, అభ్యర్థులను ఎంపిక చేస్తామన్న ఆ పార్టీ ప్రకటన ఇప్పుడు ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. ఐవీఆర్ సిస్టమ్ లో పాలు పంచుకుని అభ్యర్థుల ఎంపికలో భాగస్వాములు కావాలని టీడీపీ ప్రజలను కోరుతోంది.