: రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని నాజీ నియంత హిట్లర్ తో పోల్చడం పట్ల కాషాయదళం మండిపడింది. రాహుల్ నాయనమ్మ ఇందిరా గాంధీయే హిట్లర్ లా వ్యవహరించిందని ప్రతిదాడి చేసింది. బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో మాట్లాడుతూ, మోడీని హిట్లర్ అని పిలవడాన్ని దూషించడంగానే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ దేశంలో ఎవరైనా హిట్లర్ లా ప్రవర్తించి ఉంటే అది ఇందిరా గాంధీ తప్ప మరొకరు కాదని అభిప్రాయపడ్డారు.