: గాలింపు చర్యలు అండమాన్ కు విస్తరించిన మలేసియా
మలేసియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్-370 విమానం అదృశ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలను తాజాగా అండమాన్ దీవుల వరకు విస్తరించారు. ఇంతక్రితమే మలేసియా ప్రభుత్వం విమానం ఆచూకీ కనిపెట్టడంలో సాయం చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. చైనా నుంచి అండమాన్ సముద్ర ప్రాంతం వరకు భారత్ కూడా గాలింపు చర్యల్లో పాలుపంచుకోవాలని కోరింది.