: విద్యుత్ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు : వైఎస్ విజయమ్మ
వామపక్షాలు చేస్తోన్న విద్యుత్ దీక్ష శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందర్శించారు. మూడురోజులుగా ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేస్తోన్న వామపక్ష నేతలను, తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆమె పరామర్శించారు. వామపక్షాలు చేపట్టిన విద్యుత్ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
2003లో వామపక్షాలు చేపట్టిన విద్యుత్ ఉద్యమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా విజయమ్మ గుర్తుచేశారు. నీరు లేక ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోలేదంటూ సీఎం కిరణ్ చెబుతున్నారని, ఈ మాటలు తప్పు అని రుజువు చేస్తామని, ఈ కార్యక్రమం సీఎం నియోజకవర్గం పీలేరు నుంచే మొదలు పెడతామని విజయమ్మ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
- Loading...
More Telugu News
- Loading...