: ప్రియాంకా చోప్రా, నేను చాలా క్లోజ్: మీరా చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా.. ఇక దక్షాణిదిన నటిస్తున్న మీరా చోప్రా అక్కా చెల్లెళ్లు (కజిన్స్) అన్న సంగతి సినీ వర్గాల్లో అందరికీ తెలిసిందే. అయితే, తను, ప్రియాంక చాలా దగ్గరి స్నేహితులమని.. పరిణీతితో తనకు అంతగా సంబంధం లేదని మీరా చోప్రా చెబుతోంది. తన కెరీర్ కు సహాయం చేసేందుకు పీసీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వ్యక్తిగత విషయాలు కూడా తనతో పంచుకుంటుందని చెబుతోంది. గతంలో తమ బంధుత్వంపై మాట్లాడిన పరిణీతి, మీరా తమకు దూరపు బంధువు మాత్రమేనని చెప్పింది. వీటిపై స్పందించిన మీరా... తమకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు తామంతా కలసి పెరిగామని, మధ్యలో విడిగా వేరువేరు సిటీల్లో ఉండటంతో పరిణీతితో అంతగా స్నేహం లేదంది. కాగా, తను, ప్రియాంక ఒకే వయసు వారమని మీరా వివరించింది.