: జైరాం రమేష్ ఓ పిచ్చి పుల్లయ్య: యనమల


కేంద్ర మంత్రి జైరాం రమేష్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. ఆయనొక పిచ్చి పుల్లయ్య అంటూ ఎద్దేవా చేశారు. సీమాంధ్రకు జైరాం చెబుతున్న ప్యాకేజీలన్నీ విలువలేనివని కొట్టిపారేశారు. వార్డు మెంబర్ గా కూడా గెలిచే సత్తా జైరాంకు లేదని విమర్శించారు. ఈ రోజు తునిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారు.

  • Loading...

More Telugu News