: పార్టీలో విభేదాల్లేవు... యూపీఏకు మళ్లీ మద్దతిచ్చే ప్రసక్తే లేదు: డీఎంకే
యూపీఏ వ్యవహారంలో తీసుకున్ననిర్ణయంపై వెనక్కు తగ్గేదిలేదని డీఎంకే ప్రకటించింది. ఒకసారి తెగతెంపులు చేసుకున్నాక ఇక యూపీఏకు మద్దతును పొడిగించేదే లేదని తేల్చిచెప్పింది. పార్టీ కార్యవర్గ భేటి ఈ రోజు చెన్నయ్ లో జరిగింది.అనంతరం సమావేశం వివరాలను డీఎంకే నేత తిరుచి శివ చెన్నైలో మీడియాకు వెల్లడించారు.
యూపీఏకు బయటినుంచి కూడా మద్దతు ఇవ్వాలనుకోవడంలేదని చెప్పారు. అళగిరి విషయంలో మీడియాలో వస్తున్న వార్తలను పార్టీ ఖండించిందన్నారు. ఎవరి మధ్యా విభేదాలు లేవన్నారు. శ్రీలంకలో తమిళుల సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలు ప్రధానంగా చర్చించినట్టు తెలిపారు. పార్టీ అధినేత కరుణానిధి, పలువురు డీఎంకే అగ్ర నేతలు పాల్గొన్నకార్యవర్గ సమావేశంలో దాదాపు 12 నుంచి 15 తీర్మానాలు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు వచ్చే ఏడాది లంక రాజధాని కొలంబోలో జరగనున్న 'కామన్ వెల్త్ దేశాల సదస్సు'లో భారత్ పాల్గొనకుండా ఆపాలని ఓ నేత పట్టుబట్టినట్టు సమాచారం. మొత్తానికి అళగిరి అసంతృప్తి, యూపీఏ అంశంపై జరిగిన డీఎంకే సమావేశం కఠిన నిర్ణయాలే తీసుకున్నట్లు కనబడుతోంది.