: బండగా ఉంటే.. చదువులో డొల్లే!


లావుగా ఉంటే ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు వస్తాయని ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కానీ, లావుగా ఉంటే బాలికలు చదువులో వెనుకబడతారని తాజాగా ఓ సర్వే హెచ్చరిస్తోంది. చిన్న వయసులో లావుగా ఉన్న బాలికలు చదువుల్లో వెనుకబడుతున్నట్లు డుండీ, స్ట్రాత్ క్లియడ్, జార్జియా, బ్రిస్టల్ యూనివర్సిటీలకు చెందిన వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. బీఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్) ఎక్కువగా ఉన్న 11ఏళ్ల బాలికలు, ఆరోగ్యంగా ఉన్న బాలికలతో పోల్చి చూసినప్పుడు.. తర్వాతి సంవత్సరాల్లో చదువులో తక్కువ ప్రతిభ కనబరిచినట్లు తేలింది. సరిపడా బరువున్న వారితో పోలిస్తే బరువు అధికంగా ఉన్నవారు టీనేజీ అంతటా చదువులో తక్కువ పనితీరు చూపినట్లు డుండీ వర్సిటీకి చెందిన డాక్టర్ జోసీబూత్ తెలిపారు. అయితే, మొత్తం మీద చూస్తే మాత్రం లావు ప్రభావం తక్కువేనని వీరు అంటున్నారు. 6,000 మంది చిన్నారుల డేటాను విశ్లేషించగా వీరు ఈ తేడాలను గుర్తించారు.

  • Loading...

More Telugu News