: కుటుంబ పాలన నడపాలని కేసీఆర్ చూస్తున్నారు: మంద కృష్ణ
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ విమర్శలు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ లో మాట్లాడిన ఆయన, తెలంగాణలో కుటుంబ పాలన నడపాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. తెలంగాణలో దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ తో సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు.