: నేతల ద్వేష ప్రసంగాలపై లా కమిషన్ స్పందన కోరిన సుప్రీం


ద్వేష ప్రసంగం అంటే ఏమిటి? రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలా? వీటిపై వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ రోజు లా కమిషన్ ను ఆదేశించింది. నేతలు ద్వేష ప్రసంగాలు చేయకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా.. దానిని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారించింది. అనంతరం లా కమిషన్ నుంచి వివరాలు కోరుతూ విచారణను వాయిదా వేసింది. ఈ నెల 3న ఇదే పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా నేతలను ఆపలేమని వ్యాఖ్యానించింది. 128 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో 128కోట్ల అభిప్రాయాలు ఉండవచ్చని పేర్కొంది.

  • Loading...

More Telugu News