: విమాన అన్వేషణ నుంచి వెనక్కి తగ్గిన వియత్నాం


నాలుగు రోజులవుతోంది. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు 239 మందితో వెళుతున్న మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం శనివారం తెల్లవారుజాము నుంచి అడ్రస్ లేకుండా పోయింది. ఎక్కడ కూలిందో ఇంత వరకూ అంతుచిక్కలేదు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం సరిహద్దులకు సమీపంలో కూలి ఉంటుందనే అంచనాలతో అన్వేషణ సాగిస్తున్నారు. వియత్నాం, చైనా, మలేసియా దేశాలు... నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో అన్వేషిస్తున్నా ఫలితం దక్కలేదు. దీంతో అన్వేషణ పనుల నుంచి వియత్నాం పాక్షికంగా వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించింది. కొన్ని విమానాలతోనే అన్వేషించే యోచనలో ఉన్నట్లు వియత్నాం రవాణా మంత్రి ఫామ్ క్యు ట్యూ తెలిపారు. ఇతర పనులన్నింటినీ ఆపేసినట్లు చెప్పారు. మరోవైపు మలక్కా సంధిలో విమాన జాడలను కనుగొన్నట్లు వచ్చిన వార్తలను మలేసియన్ ఎయిర్ ఫోర్స్ ఖండించింది.

  • Loading...

More Telugu News