: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన తోట త్రిమూర్తులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్రిమూర్తులుకు పసుపు కండువా కప్పి చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ... సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు.