: నేడు విశాఖలో టీడీపీ ప్రజాగర్జన
తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో ఈ రోజు ప్రజాగర్జన బహిరంగ సభను నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయంకు చంద్రబాబు చేరుకుంటారు. ఆయన పాల్గొనే ర్యాలీ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమై పూర్ణామార్కెట్, టౌన్ కొత్తరోడ్డు, సీహార్సెన్ మీదుగా బహిరంగ సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని మినీ స్టేడియంకు చేరుకుంటుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, వెంకట్రామయ్య, రమణమూర్తి రాజులు ఈ సభలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో లాంఛనంగా చేరనున్నారు.