: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపైనే ఇప్పుడు దృష్టి సారించాలి: రాజ్ నాథ్


హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ ఆవిర్భావ సభలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో సుష్మా పాత్ర మరువలేనిదని రాజ్ నాథ్ అన్నారు. గతంలో తాము దేశంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఎలాంటి సమస్యలు రాలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కల సాకారం అయ్యిందని అన్నారు. ఇప్పడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపైన దృష్టి పెట్టాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని రాజ్ నాథ్ తెలిపారు.

  • Loading...

More Telugu News