: తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర అమోఘం: అరుణ్ జైట్లీ


తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. 2000 సంవత్సరంలోనే తెలంగాణ ఏర్పాటుపై చర్చలు జరిగాయని అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ అభినందన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్లయిందని చెప్పారు. తెలంగాణ కోసమని ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచి కట్టుబడి ఉందని అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభించిందని ఆరోపించారు. తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ ఆశయమని జైట్లీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర అమోఘమని అన్నారు.

  • Loading...

More Telugu News