: భారత షూటర్ల 'పసిడి' కాంతులు
ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత షూటర్లు స్వర్ణ పతకాలతో సత్తా చాటారు. మహిళల విభాగంలో హీనా సిద్ధూ, పురుషుల విభాగంలో చైన్ సింగ్ పసిడి పతకాలు సాధించారు. కువైట్ లో జరిగిన ఈ పోటీల్లో హీనా ఎయిర్ పిస్టల్ అంశంలో ప్రథమస్థానంలో నిలిచింది. పురుషుల ఎయిర్ రైఫిల్ విభాగంలో చైన్ సింగ్ అగ్రస్థానం దక్కించుకున్నాడు.