: టైగర్ ఉడ్స్ చెత్త ప్రదర్శన... గాయాలపాలైన వీక్షకులు


విఖ్యాత గోల్ఫర్ టైగర్ ఉడ్స్ కెరీర్ లో ఎన్నడూ లేనంతగా చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఎంతలా అంటే, ఇతగాడు కొట్టిన కొన్ని షాట్లు అదుపుతప్పి ప్రేక్షకులను గాయపరిచాయి. ఫ్లోరిడాలో ఓ గోల్ఫ్ టోర్నీలో పాల్గొన్న ఉడ్స్ కు ఏదీ కలిసిరాలేదు. సునాయాసమైన హోల్స్ ను పాయింట్లుగా మలుచుకోలేకపోయాడు. తొలుత ఇతగాడు కొట్టిన ఓ షాట్ జర్మన్ టూరిస్టును గాయపరిచింది. బంతి అతడి తలపై బలంగా తాకడంతో వెంటనే తలను అలాగే పట్టుకుని కుప్పకూలాడు. రక్తస్రావం కూడా అయింది. దీంతో, ఆ జర్మన్ దేశస్తుడికి క్షమాపణ చెప్పిన ఉడ్స్ ఆటోగ్రాఫ్ చేసిన ఓ గ్లోవ్ ను తన గుర్తుగా ఇచ్చాడు. ఆ జర్మనీ యువకుడు కూడా తన తలకు తగిలిన బంతిని తీసుకున్నాడు, సంఘటనకు గుర్తుగా.

ఇక, మళ్ళీ ఆట మొదలెట్టిన ఉడ్స్ ధాటికి మరో ప్రేక్షకుడు బలయ్యాడు. ఈసారి బంతి భుజంపై తాకింది. పాపం, క్షమాపణతోపాటు సంతం చేసిన గ్లోవ్ సమర్పించుకోక తప్పలేదు టైగర్ మహాశయుడికి. చచ్చీచెడీ ఆట పూర్తి చేసిన ఉడ్స్ చివరికి ఆ టోర్నీలో 25వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News