: కేసీఆర్... నీ భాష మార్చుకుంటే మంచిది: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన భాష మార్చుకుంటే మంచిదని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి హితవు పలికారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కవి నన్నయ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. 1948 తర్వాత భారత మిలటరీ బలగాలు తెలంగాణలో దాష్ఠీకాన్ని సృష్టించాయంటూ కేసీఆర్ పేర్కొనటం మంచిది కాదని ఆయన అన్నారు. భారత సైన్యాన్ని అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.