: ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: డీజీపీ
ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ ప్రసాదరావు చెప్పారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాల్లో 30 పోలీస్ యాక్ట్, పట్టణాల్లో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.