: నాగ్ పూర్లో కేజ్రివాల్ తో డిన్నర్ ఖరీదు రూ.10 వేలు
ఆమ్ ఆద్మీ పార్టీ నిధుల సమీకరణ కోసం విందులు ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో కలిసి భోజనం చేసేందుకు రూ.20 వేలు వసూలు చేయాలని నిర్ణయించిన 'ఆమ్ ఆద్మీ', తాజాగా నాగ్ పూర్లోనూ 'నిధుల నిమిత్తం విందు' కార్యక్రమం ఏర్పాటు చేసింది. బెంగళూరులో విందు మార్చి 15న నిర్వహించనుండగా, నాగ్ పూర్లో మార్చి 13న విందు ఉంటుంది. 150 నుంచి 200 మంది వరకు అతిథులు వస్తారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.