: జై సమైక్యాంధ్ర పార్టీ నేతలకు జనాలు చెప్పుల దండ వేస్తారు: గాలి


జై సమైక్యాంధ్ర పార్టీ నేతలకు ప్రజలు తెగిపోయిన చెప్పుల దండను వేస్తారని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోవడానికి కిరణే కారణమని ధ్వజమెత్తారు. ఇంకా లాస్ట్ బాల్ ఉందని కిరణ్ అంటున్నాడని... బ్యాట్, బాల్ రెండూ సోనియాకు అప్పగించిన తర్వాత... ఇంకొక బాల్ ఎక్కడ నుంచి వస్తుందని ఎద్దేవా చేశారు. సోనియా ఆదేశాలతోనే కిరణ్ సరికొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. కొత్త పార్టీలు టీడీపీకి మద్దతివ్వాలని చంద్రబాబు చెప్పింది పవన్ కల్యాణ్ గురించి అని వివరించారు.

  • Loading...

More Telugu News