: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు ఎదురు దెబ్బ


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతల వలసలు అధినేతలకు షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు పెద్ద దెబ్బే తగిలింది. రాష్ట్రంలో ఆయన మంత్రివర్గంలోని రేణు కుశ్వా ఈ రోజు తన పదవికి రాజీనామా చేశారు. జేడీ(యు)ను వీడి వెంటనే బీజేపీలో చేరారు. కాగా, నిన్ననే (సోమవారం) ఆమె భర్త విజయ్ సింగ్ బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ నిర్వహించిన ర్యాలీలో కాషాయదళంలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News