: కాంగ్రెస్ కు కిరణ్ వెన్నుపోటు పొడిచారు: జైరాం రమేష్
రాష్ట్ర విభజనను వ్యతిరేకించి, కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి నిన్న (సోమవారం) సొంత పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జైరాం రమేష్, కాంగ్రెస్ కు కిరణ్ వెన్నుపోటు పొడిచారని అన్నారు. కాగా, పోలవరం ఆర్డినెన్స్ తన చేతుల్లో లేదని, ఆర్డినెన్స్ ఎప్పుడు వస్తుందో కూడా తనకు తెలియదన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ చనిపోలేదన్న జైరాం పార్టీలో చేరేందుకు యువకులకు ఇదే అవకాశమని చెప్పారు.