: ఏడు కిలోల బంగారు బిస్కెట్లు దొరికాయ్!


ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా తమిళనాడులోని వేదారణ్యం జిల్లాలో సోమవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్న ఎన్నికల అధికారులకు ఒక్కసారిగా కళ్లు చెదిరాయి. ఒకటి, రెండూ కాదు ఏకంగా ఏడు కిలోలకు పైగా బంగారపు బిస్కెట్లను ప్రయాణికుడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. సదరు వ్యక్తిని ఎన్నికల అధికారులు తమిళనాడు పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన బంగారపు బిస్కెట్ల విలువ మార్కెట్లో కోటిన్నర రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News