: వాళ్ళు నోటికి పనిచెప్పారు... వీళ్ళు జరిమానా విధించారు


వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన టి20 మ్యాచ్ వాడీవేడీగా సాగింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆటగాడు రవి బొపారా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో బొపారా ఓ సింగిల్ తీయడం పూర్తి చేసి విండీస్ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ ను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశాడు. దీంతో, శామ్యూల్స్ కూడా నోటికి పనిచెప్పాడు. శామ్యూల్స్ కు మద్దతుగా విండీస్ కెప్టెన్ డారెన్ సామీ కూడా వివాదంలో తలదూర్చాడు. బొపారాపై నోరుపారేసుకున్నాడు. ఈ విషయమై అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఐసీసీ నియమావళి ప్రకారం లెవెల్ 1 తప్పిదానికి పాల్పడ్డట్టు గుర్తించిన రిఫరీ... బొపారా మ్యాచ్ ఫీజులో 25 శాతం, సామీ ఫీజులో 20 శాతం, శామ్యూల్స్ ఫీజులో 10 శాతం కోత విధించారు.

  • Loading...

More Telugu News