: టీమిండియా క్రికెటర్ల జోష్ 'ఫార్ములా'


ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ను 4-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా క్రికెటర్లు తమ ఆనందాన్ని పలు రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మరో ఐదుగురు క్రికెటర్లు గుర్గావ్ లోని సుప్రసిద్ధ ఫార్ములా వన్ రేస్ ట్రాక్ 'బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్' ను నేడు సందర్శించారు. అక్కడ, తమ స్పోర్ట్స్ బైకులు, కార్లతో వరల్డ్ క్లాస్ ట్రాక్ పై ఝుమ్మంటూ దూసుకెళ్ళారట.

బైకుల పిచ్చోడని ముద్ర వేయించుకున్న ధోనీ, గతేడాది కొన్న ఎక్స్132 హెల్ కాట్ బైక్ మీద రేస్ ట్రాక్ ను ఓ చూపు చూశాడు. ధోనీకి సన్నిహితుడని పేరుపడ్డ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఓజా కూడా ధోనీ బండిని నడిపి తృప్తి పడ్డట్టు సమాచారం. కాగా, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సింపుల్ గా ఓ టాక్సీలో సర్క్యూట్ ను ఓసారి పరిశీలించాడట. గతేడాది ఇక్కడ జరిగిన ఫార్ములా వన్ రేస్ ను సచిన్ జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇక, ఢిల్లీ కుర్రాళ్ళు ఇషాంత్ ఆడి-ఆర్ఎక్స్5 డ్రైవ్ చేయగా.. విరాట్ కోహ్లీ ఓ స్పోర్ట్స్ కార్ లో విహరించాడు. కాస్సేపు రైడింగ్ చేసిన అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడాడు. తొలిసారి బుధ్ ట్రాక్ ను సందర్శించిన ధోనీ ఇప్పటివరకు ఇక్కడికి రాలేకపోయినందుకు చింతిస్తున్నానని చెప్పాడు.

'ఇదో అద్భుతమైన అనుభవం. ఇక్కడికి కొంచెం లేటుగా వచ్చానని అనుకుంటున్నా. సూపర్ స్పోర్ట్స్ సిరీస్ రేసులు వీక్షించేందుకు ఇక్కడికి వస్తా. ఈసారి హెల్ కాట్ తీసుకురాను, మరో స్పోర్ట్స్ బైక్ తీసుకువస్తా' అన్నాడు. ఇక వైస్ కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, తానెప్పుడూ ఇంత వేగంగా డ్రైవ్ చేయలేదని మురిసిపోయాడు. 

  • Loading...

More Telugu News