: టీమిండియా కోచ్ గా ద్రావిడ్ ను నియమించండి: గవాస్కర్


గతకొంతకాలంగా టీమిండియా దారుణ పరాజయాలు నమోదు చేయడానికి కారణం కోచ్ డంకన్ ఫ్లెచరే కారణమంటున్నాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. ఫ్లెచర్ తన పసలేని వ్యూహాలతో భారత జట్టును పాతాళానికి తీసుకెళ్ళాడని విమర్శించాడు. ఫ్లెచర్ ను తక్షణమే తొలగించి కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను ఎంపిక చేయాలని బీసీసీఐకి సూచించాడు. ద్రావిడ్ లాంటి వ్యక్తి పర్యవేక్షణలో జట్టు చక్కగా రాణిస్తుందని అభిప్రాయపడ్డాడు.

ఫ్లెచర్ హయాంలో 2011 ఏప్రిల్ నుంచి 30 టెస్టులాడిన టీమిండియా 12 నెగ్గి, 12 మ్యాచ్ లలో ఓటమిపాలైందని, అదేవిధంగా 80 వన్డేలాడి 45 గెలిచి, 29 మ్యాచ్ లు చేజార్చుకుందని వివరించాడు. సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ వంటి ఆటగాళ్ళపై ప్రదర్శన ఆధారంగా వేటు వేసినప్పుడు, జట్టు సహాయక సిబ్బందికి ఎందుకు ఉద్వాసన పలకరని సన్నీ ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News