: లైసెన్స్డ్ తుపాకులను తిరిగిచ్చేయండి: సీపీ అనురాగ్ శర్మ


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ ఉన్న రివాల్వర్లను ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక పోలీస్ స్టేషన్ లో గాని ఆయుధ డీలర్ వద్ద గాని డిపాజిట్ చేయాలని హైదరాబాదు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ బ్యాంకుల వద్ద సెక్యూరిటీ గార్డులకు ఇందుకు మినహాయింపు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఇన్ స్పెక్టర్లు సోమవారం రాత్రి వరకు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కలిపి 360 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. దీంతో పాటు 250 మంది వద్దనున్న లైసెన్స్డ్ రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులో లైసెన్స్డ్ తుపాకులను కలిగిన వారు మొత్తం నాలుగు వేలకు పైగా ఉన్నారని సీపీ తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు ఆయా డివిజన్, జోన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సీపీ చెప్పారు.

  • Loading...

More Telugu News