: వైభవంగా ప్రారంభమైన కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహాలయమైన కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ దశమి రోజున ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు బహుళ నవమి రోజున ముగుస్తాయి. పక్షం రోజుల పాటు ఘనంగా జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో దేవతామూర్తుల వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.