: తెలంగాణ పాలిట విలన్ జైరాం రమేష్: హరీష్ రావు


జైరాం రమేష్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ, సోనియాగాంధీని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. జైరాం తన చేతలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ని నిండా ముంచేస్తారని అన్నారు. జేఏసీకి, టీఆర్ఎస్ పార్టీకి మధ్య అంతరం పెంచే పనిలో జైరాం రమేష్ ఉన్నారని ఆరోపించారు. జేఏసీ గురించి మాట్లాడే అర్హత జైరాంకు లేదని అన్నారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఉన్న సయోధ్యను జైరాం చెడగొడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. తనకు తెలంగాణ రావడం ఇష్టంలేదని జైరాం అన్నారని... తెలంగాణ వచ్చిన ఆనందంలో తాముంటే... తమ ఆనందాన్ని ఆయన చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైరాం వల్లే పోలవరం విషయంలో అన్యాయం జరిగిందని, సీమాంధ్ర ఉద్యోగులకు తెలంగాణలో పెన్షన్లు ఇవ్వాల్సి వస్తోందని, ఉద్యోగుల బదిలీలను నేటివిటీ ఆధారంగా కాకుండా జనాభా ప్రాతిపదికన చేయాల్సి వస్తోందని ఆరోపించారు. తెలంగాణ పాలిట జైరాం రమేష్ ఓ విలన్ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News