: అమెరికాలో 70 మంది భారతీయుల పాస్ పోర్టులు చోరీ
అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఓ కంపెనీ నుంచి దాదాపు 70 మంది భారతీయుల పాస్ పోర్టులను దొంగలించారు. భారత రాయబార కార్యాలయం ఈ కంపెనీకి వీసా, పాస్ పోర్టు సంబంధిత సేవలను ఔట్ సోర్సింగ్ కు ఇచ్చింది. పాస్ పోర్టులు దొంగల పాలవడంతో... అవి దుర్వినియోగం కాకుండా ఉండేందుకు భారతీయ రాయబార కార్యాలయం, స్థానిక పోలీసులు, విదేశాంగ శాఖ అప్రమత్తమయ్యాయి. చోరీకి గురైన పాస్ పోర్టులను భారతీయ రాయబార కార్యాలయం రద్దు చేసింది. అత్యంత కీలకమైన ఆ కార్యాలయంతో భద్రతాపరమైన లోపాలు ఎందుకు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.