: సూర్యనారాయణ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను ఈ రోజు ఉదయం 6.23 గంటల నుంచి 6.32 గంటల వరకు సూర్యుని లేలేత కిరణాలు తాకాయి. ఈ అపురూప సుందర దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు. ఆదిత్యుని పాదాలను తాకిన కిరణాలు శిరస్సు వరకు ప్రసరించాయి. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారిన సందర్భంగా ఈ కిరణాలు స్వామి మూలవిరాట్ కు తాకాయి. ఆదిత్యునిపై ప్రసరించే ఈ కిరణాలు చూసిన వారికి నేత్ర, హృద్రోగ వ్యాధులు నయమవుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు.