: ప్రభుత్వంతో నేడు ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు
మధ్యంతర భృతి చెల్లించకపోతే ఈ నెల 12 నుంచి సమ్మె చేస్తామని ఆర్టీసీ సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ రోజు (మంగళవారం) చర్చలకు రావాల్సిందిగా కార్మికశాఖ ఆహ్వానించింది. దీంతో ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, ఆర్టీసీ సమ్మె వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురవుతారని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.