: విజయవాడ బస్టాండ్ లో తుపాకీ పేలి ఒకరికి గాయాలు
విజయవాడ బస్టాండ్ లో ఈ రోజు తెల్లవారుజామున ఎరైవల్ బ్లాక్ లోని టాయిలెట్స్ వద్ద ఓ యువకుడి చేతిలోని తుపాకీ పేలింది. ఈ ఘటనలో వీర వెంకటరమణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం ఫెర్రీకి చెందిన రవిదత్తా మరుగుదొడ్డిలోకి వెళ్లిన కొద్దిసేపటికి అతని చేతిలో ఉన్న తుపాకీ పేలింది. గాయపడిన వెంకటరమణను టాయిలెట్స్ వద్ద పనిచేస్తున్న సిబ్బంది వెంటనే పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. కృష్ణ లంక పోలీసులు రవిదత్తా పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.