: జర్నలిస్టులకు చిదంబరం నీతిసూత్రాలు


పాత్రికేయులు ఓ అంశంపై కలం కదిపేముందు లోతుగా పరిశోధించాలని, వాస్తవాలను బేరీజు వేసుకోవాలని కేంద్రమంత్రి చిదంబరం సూచించారు. బ్రేకింగ్ న్యూస్ కోసం పడే ఆరాటం కారణంగా వార్తా శోధన కుంటుపడుతుందని అభిప్రాయపడ్డారు. రిపోర్టింగ్ కు ఎప్పుడో కాలం చెల్లిందని, ఇప్పుడంతా బ్రేకింగ్ న్యూస్ హవా నడుస్తోందని పేర్కొన్నారు. కేరళ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యూస్ బ్రేక్ చేసేందుకు జర్నలిస్టుల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. పోటీదారుల కంటే ముందే వార్తలు అందించాలన్న తపన నేటి తరం జర్నలిస్టుల్లో పెరిగిపోయిందని చెప్పారు.

అంతేగాకుండా, జర్నలిజం ఓ ప్రమాదకరవృత్తి అని అభిప్రాయపడ్డారు. వివాదాలు ఉన్న చోటే వారు ఉంటారని, అక్కడ వారికి మరిన్ని కథనాలు లభ్యమవుతాయని చెప్పుకొచ్చారు. ఇరాక్, ఇరాన్, సిరియా వంటి ప్రాంతాల్లో పనిచేసే పాత్రికేయులకు ప్రాణహాని అధికంగా ఉంటుందని చిదంబరం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News