: స్పెల్లింగ్ పోటీలో విజేతగా నిలిచిన భారతీయ బాలుడు


అమెరికాలోని మిస్సోరి కౌంటీలో నిర్వహించిన స్పెల్లింగ్ బీ పోటీల్లో భారతీయ సంతతికి చెందిన కుష్ శర్మ (13) విజేతగా నిలిచాడు. మొత్తం 95 రౌండ్లపాటు సుదీర్ఘంగా సాగిన ఈ పోటీల్లో తుదిదశలోనూ కుష్ తన సత్తా చాటాడు. దాంతో ‘జాక్సన్ కౌంటీ స్పెల్లింగ్ బీ’ టైటిల్ దక్కించుకున్నాడు. కుష్ శర్మ ప్రస్తుతం ఫ్రాంటియర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. అలాగే, వచ్చే మే నెలలో వాషింగ్టన్ లో జరగబోతున్న స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలకూ ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో గతేడాది హైదరాబాదుకు చెందిన ప్రవాస భారతీయుడు అరవింద్ మహంకాళి (13) గెలుపొందాడు. ఇలా అమెరికా జాతీయస్థాయి పోటీల్లో ప్రవాస భారతీయ విద్యార్థులు విజయం సాధించడం వరుసగా ఆరోసారి.

  • Loading...

More Telugu News